Shamshabad Airport: రూ. 5 వేలతో పుష్పక్ జనరల్ బస్‌పాస్‌లు తెచ్చిన తెలంగాణ ఆర్టీసీ

TGRTC announced rout and monthly bus pass to Shamshabad Airport

  • శంషాబాద్‌ విమానాశ్రయానికి నిత్యం ప్రయాణించే వారికి ఉపయోగం
  • రూ. 5 వేలతో ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్‌పాస్
  • పలు మార్గాల్లో రూట్‌పాస్‌లు కూడా ప్రకటించిన ఆర్టీసీ

శంషాబాద్ విమానాశ్రయానికి నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్‌పాస్‌’ను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 5 వేలు. ఈ పాస్‌తో ఏ బస్సులోనైనా, సిటీలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. 

పుష్పక్ పాస్‌తోపాటు శంషాబాద్, ఆరాంఘర్, బాలాపూర్ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్, గచ్చిబౌల నుంచి విమానాశ్రయానికి రూట్‌పాస్‌, గ్రీన్ మెట్రో గ్రేటర్‌జోన్‌లోని ప్రయాణికుల కోసం మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో రూ. 1900తో నెలవారీ పాస్‌ను తీసుకొచ్చింది. ఇది సికింద్రాబాద్-పటాన్‌చెరు (219), బాచుపల్లి-వేవ్‌రాక్ వయా జేఎన్టీయూ (195), కోఠి-కొండాపూర్ (127కే) మార్గాల్లో చెల్లుబాటు అవుతుంది.,

రూట్‌పాస్ ధరలను రూ. 2 వేల నుంచి రూ. 4 వేలుగా నిర్ణయించింది. శంషాబాద్ నుంచి రూ. 2 వేలు, ఆరాంఘర్, బాలాపూర్ క్రాస్‌రోడ్ నుంచి రూ. 3 వేలు, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి రూ. 4 వేలుగా పాస్ ధరలను నిర్ణయించింది.

More Telugu News