Team India Victory Parade: ముంబైలో నేడు టీమిండియా విక్టరీ పరేడ్.. అభిమానులకు రోహిత్ శర్మ ఆహ్వానం

Rohit Sharma Invites Fans To Team Indias Victory Parade

  • ప్రపంచకప్‌తో నేడు భారత్‌లో కాలుపెట్టనున్న టీమిండియా
  • ప్రధాని మోదీని కలవనున్న టీమిండియా సభ్యులు, అనంతరం మోదీతో అల్పాహారం
  • ఆ తరువాత చార్టెడ్ ఫ్లైట్‌లో ముంబైకి పయనం
  • ముంబైలో నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకూ విక్టరీ పరేడ్
  • చివరి ఒక కిలోమీటర్ పరేడ్‌లో పాల్గొనాలంటూ అభిమానులకు రోహిత్ శర్మ ఆహ్వానం

టీ20 ప్రపంచకప్ గెలుపుతో యావత్ దేశం గర్వపడేలా చేసిన టీమిండియా.. అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ముంబైలో గురువారం సాయంత్రం నిర్వహించనున్న విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలంటూ అభిమానులను ఆహ్వానించింది. ఈ మేరకు రోహిత్ శర్మ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. నేడు భారత్‌కు చేరుకున్నాక టీమిండియా ప్రధాని మోదీని కలవనుంది. అనంతరం, టీం సభ్యులందరూ చార్టెడ్ ఫ్లైట్‌లో ముంబై చేరుకుంటారు. ఆ తరువాత విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వాంఖడే చేరుకుంటారు. ఈ క్రమంలో ఓపెన్ బస్ కవాతు చేద్దామని నిర్ణయించారు. పరేడ్‌లో పాల్గొనేందుకు రావాలంటూ అభిమానులను టీమిండియా రథసారధి రోహిత్ శర్మ ఆహ్వానించాడు. 

‘‘ఈ ప్రత్యేక క్షణాల్ని మీ అందరితో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. జులై 4 సాయంత్రం 5 గంటలకు మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకూ జరిగే పరేడ్‌లో మనందరం పాల్గొని భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అని రోహిత్ శర్మ ఎక్స్ లో పోస్టు పెట్టాడు. బీసీసీఐ సెక్రెటరీ జైషా కూడా ఈ మేరకు అభిమానులకు ఆహ్వానం పంపించారు. 

కాగా, ఢిల్లీకి చేరుకున్న టీమిండియా క్రీడాకారులు, సహాయక సిబ్బందిని తొలుత ప్రధాని మోదీ సత్కరిస్తారు. ఆ తరువాత వారితో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. అనంతరం విమానంలో టీమిండియా ముంబైకి చేరుకుంటుంది. అక్కడ నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే వరకూ ఓపెన్ బస్ పరేడ్ ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో జై షా టీమిండియా సభ్యులకు రూ. 125 కోట్ల నగదు బహుమతిని పంపిణీ చేస్తారు. ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్ పేరున్న ప్రత్యేక చార్టెడ్ విమానం టీంసభ్యులతో బార్బడాస్ నుంచి స్థానిక కాలంమానం ప్రకారం ఉదయం 4.50 గంటలకు బయలుదేరింది.

Team India Victory Parade
Rohit Sharma
T20 World Cup 2024
BCCI

More Telugu News