Congress: తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా

TPCC chief selection postponed

  • నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం
  • పరస్పర అంగీకారం అనంతరమే అధ్యక్షుడి నియామకం
  • రేసులో మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీ, ఇతర నేతలు

తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అగ్రనేతల పరస్పర అంగీకారం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారు.

పీసీసీ పదవి కోసం మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కూడా ఈ పదవి కోసం అధిష్ఠానం వద్ద అడుగుతున్నారని సమాచారం.

Congress
TPCC President
Telangana
  • Loading...

More Telugu News