YS Sharmila: డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల భేటీ

YS Sharmila meets DK Shiva Kumar

  • ఈ నెల 8న తన తండ్రి వైఎస్ 75వ జయంతి కార్యక్రమానికి విచ్చేయాలని ఆహ్వానం
  • విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడి
  • ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ సహా మరికొందరికి ఆహ్వానాలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల బుధవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. బెంగళూరులోని ఆయన నివాసానికి చేరుకున్న షర్మిల ఈ నెల 8న తన తండ్రి, ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 

షర్మిల ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహను సైతం ఆహ్వానించారు. 

గతంలో తన తండ్రి పేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. అలాగే ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అలాగే లోక్ సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసేందుకు వీలుగా కడప ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది. అయితే ఆమె పరాజయం పాలయ్యారు.

YS Sharmila
DK Shivakumar
Meet
YS Rajasekhar Reddy
75th Birth Anniversary
Invitation
  • Loading...

More Telugu News