Illegal Immigration: అమెరికాకు అక్రమ వలస యత్నం.. వృద్ధుడిలా నటిస్తూ పట్టుబడ్డ భారత యువకుడు!

24 Year Old Posed As Senior Citizen In Donkey Route Attempt To Reach US

  • ఉత్తరప్రదేశ్ యువకుడి ప్లాన్‌ను వమ్ము చేసిన ఢిల్లీ విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ సిబ్బంది
  • వృద్ధుడిలా కనిపించేందుకు ప్రయత్నించి విఫలమై పోలీసులకు చిక్కన వైనం
  • అమెరికాకు అక్రమంగా వేళ్లేందుకు మధ్యవర్తితో రూ.60 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న యువకుడు
  • తొలివిడతలో రూ.30 లక్షలు ఇచ్చిన వైనం

ఎలాగైనా అమెరికాకు వెళ్లాలన్న ఓ యువకుడి యత్నం చివరకు పోలీసులకు చిక్కేలా చేసింది. తొలుత కెనడా వెళ్లి అక్కడి నుంచి అమెరికాలో కాలుపెడదామనుకున్న అతడి ప్లాన్ ఢిల్లీ విమానాశ్రయంలో విఫలమైంది. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల గురుసేవక్ సింగ్ తన భార్యతో కలిసి అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు భారీ స్కెచ్ వేశాడు. నకిలీ పాస్‌పోర్టు వెంట తీసుకుని వృద్ధుడిలా మేకప్ వేసుకుని భార్యతో కలిసి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాడు. అతడిని చూడగానే అధికారులకు సందేహం కలిగింది. అతడు యువకుడన్న విషయాన్ని ఎంత దాచుదామనుకున్నా కుదరలేదు. దీంతో, చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. 

ఆ తరువాత నిందితుడిపై లోతైన దర్యాప్తు చేసిన పోలీసులకు మరిన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. తనను అమెరికాకు తీసుకెళ్లేందుకు నిందితుడు జగ్గీ అనే మధ్యవర్తికి ఏకంగా రూ.60 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిసింది. అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు కూడా చెల్లించినట్టు బయటపడింది. నిందితుడికి జగ్గీ నకిలీ పాస్‌పోర్టు ఇతర డాక్యుమెంట్లు సమకూర్చినట్టు పోలీసులు గుర్తించారు. తొలుత కెనడా చేరుకుని అక్కడి నుంచి డాంకీ రూట్ గా పేరుపడ్డ అక్రమమార్గంలో సరిహద్దు దాటి అమెరికా చేరుకోవాలనేది వారి ప్లాన్ అని తేల్చారు. నకిలీ డాక్యుమెంట్లు, అక్రమ విదేశాలకు వెళ్లేందుకు యత్నం తదితర నేరాల కింద నిందితుడు, అతడి భార్యపై కేసు నమోదు చేశారు. 

  • Loading...

More Telugu News