Telangana: జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ గడువు పొడిగింపు...?

Extension t Justice Narsimha Reddy commission
  • విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అంశంపై విచారణ కోసం కమిషన్‌ను వేసిన ప్రభుత్వం
  • జూన్ 30 వరకు నివేదిక ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం
  • తాజాగా, గడువు నెల రోజుల పొడిగింపు?
విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణం అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ గడువు తెలంగాణ ప్రభుత్వం పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కమిషన్ గడువును జులై 31 వరకు పొడిగించినట్లుగా తెలుస్తోంది. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వరకు వివిధ అంశాలపై విచారణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నర్సింహారెడ్డి కమిషన్‌ను వేసింది.

ఏప్రిల్ 7వ తేదీ నుంచి కమిషన్ విచారణను ప్రారంభించింది. జూన్ 30 నాటికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు ఇచ్చింది. కానీ విచారణ పూర్తి కాలేదు. విచారణ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభుత్వం గడువును మరో నెల రోజులు పొడిగించినట్లుగా తెలుస్తోంది.
Telangana
Congress
Power

More Telugu News