Nara Lokesh: గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నవారికి ఈ మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు: నారా లోకేశ్

Nara Lokesh told fee exemption in Mega DSC for those who applied DSC in YCP ruling

  • పాఠశాల విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమావేశం
  • టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై సమీక్ష
  • టెట్ సిలబస్ మార్పు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదన్న లోకేశ్

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ టెట్, మెగా డీఎస్సీ నిర్వహణ అంశాపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులకు సూచించినట్టు నారా లోకేశ్ వెల్లడించారు. 

ఇక టెట్ సిలబస్ మార్పు అంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేశారు. సిలబస్ లో ఎలాంటి మార్పులు చేయడంలేదని తెలిపారు. టెట్ సిలబస్ వివరాలకు https://aptet.apcfss.in వెబ్ పోర్టల్ ను సందర్శించాలని లోకేశ్ సూచించారు. 

"మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎదురైన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించాను" అని లోకేశ్ వివరించారు.

  • Loading...

More Telugu News