Zika Virus: మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం... పూణేలో ఆరు కేసుల నమోదు

Zika Virus spreads in Maharashtra

  • తాజాగా పూణేలో రెండు కొత్త కేసులు
  • పూణే కేసుల్లో ఇద్దరు గర్భవతులు
  • గర్భవతులపై జికా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వైద్యులు

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేగింది. ఒక్క పూణే నగరంలోనే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జికా వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భవతులు ఉన్నారు. 

పూణేలో మొదట ఓ డాక్టర్ కు, ఆయన టీనేజి కుమార్తెకు జికా వైరస్ పాజిటివ్ గా తేలింది. తాజాగా, ఆ డాక్టర్ కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలోనే రెండు కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఇద్దరి శాంపిల్స్ ను పరీక్షించగా, జికా వైరస్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో, ఇరంద్ వాణే ప్రాంతంలో ఆరోగ్య శాఖ విస్తృతస్థాయిలో శాంపిల్స్ సేకరిస్తోంది. 

గర్భవతులకు జికా వైరస్ సోకితే, పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పుట్టే శిశువుపై ఈ వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తుందని, సాధారణం కంటే చాలా చిన్న తలతో శిశువులు జన్మిస్తుంటారని వివరించారు. శిశువుల్లో పుట్టుకతోనే వచ్చే ఇతర అసాధారణ ఆరోగ్య సమస్యలను కూడా ఈ వైరస్ కలిగిస్తుందని తెలిపారు. 

జికా వైరస్ అనేది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుంది. ఏడిస్ ఈజిప్టై, ఏడిస్ అల్బోపిక్టస్ అనే రకాల దోమలు జికా వైరస్ వాహకాలుగా పనిచేస్తాయి. జికా వైరస్ ను 1952లో మొట్టమొదటిసారిగా ఉగాండాలో గుర్తించారు.

Zika Virus
Pune
Positive Cases
Maharashtra
  • Loading...

More Telugu News