Team India: గుడ్‌న్యూస్‌.. రేపు స్వ‌దేశానికి భార‌త క్రికెట్ జ‌ట్టు!

Indian Cricket Team to Arrive in New Delhi on Wednesday Evening

  • ‘హరికేన్ బెరిల్’ కార‌ణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన టీమిండియా
  • తాజాగా భార‌త జ‌ట్టు కోసం ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసిన బీసీసీఐ
  • ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌కు అక్క‌డి నుంచి బ‌య‌ల్దేర‌నున్న విమానం 
  • రేపు ఉద‌యం 7.45 గంట‌ల‌కు ఢిల్లీ చేరుకోనున్న భార‌త ఆటగాళ్లు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ గెలిచిన భారత‌ జట్టు ‘హరికేన్ బెరిల్’ కార‌ణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన విష‌యం తెలిసిందే. అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం భార‌త జ‌ట్టు రేపు (బుధ‌వారం) స్వ‌దేశానికి తిరిగి  రానుంది. టీమిండియా ఆట‌గాళ్లు, సిబ్బంది కోసం బీసీసీఐ ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసిన‌ట్లు అధికారిక వ‌ర్గాల స‌మాచారం. 

ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌కు అక్క‌డి నుంచి విమానం బ‌య‌లుదేర‌నుంది. రేపు ఉద‌యం 7.45 గంట‌ల‌కు ఢిల్లీకి చేరుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది. కాగా, ప్ర‌స్తుతం హ‌రికేన్ ప్రభావంతో అక్క‌డ క‌ర్ఫ్యూ విధించ‌గా ఎయిర్‌పోర్టును మూసివేశారు. అయితే బార్బడోస్ ప్రధాన మంత్రి మేడమ్ మియా మోట్లీ విమానాశ్రయాలు త్వ‌ర‌లో ప‌ని చేస్తాయ‌ని హామీ ఇచ్చారు. దాంతో భార‌త క్రికెట్ బోర్డు ఆట‌గాళ్ల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసింది.

More Telugu News