Indian-2: ‘భారతీయుడు 2’ నుంచి ‘క్యాలెండర్’ సాంగ్ రిలీజ్... స్పెషల్ ఎట్రాక్ష‌న్‌గా దక్షిణాఫ్రికా బ్యూటీ

Calendar song from Indian2 out now

  • కమల్ హాసన్, శంకర్ కలయికలో భారతీయుడు-2
  • జులై 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న భారీ చిత్రం
  • భారతీయుడు-2పై భారీ అంచనాలు

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ఇండియ‌న్ 2 ఇంట్రో గ్లింప్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. 

తాజాగా ఈ చిత్రం నుంచి 'క్యాలెండర్...' సాంగ్ రిలీజైంది. ప్ర‌ముఖ ద‌క్షిణాఫ్రికా మోడ‌ల్‌, 2017లో మిస్ యూనివ‌ర్స్ విజేత డెమి-లీ టెబో ఈ పాట‌లో న‌టించ‌టం విశేషం. 

‘‘పాలపుంతల్లో వాలి- జంట మేఘాల్లో తేలి
భూమితో పని లేకుండా- గడిపేద్దామా!
వెన్నెల మాటలు కొన్ని- చుక్క‌ల ముద్దులు కొన్ని
దేవుడి న‌వ్వులు కొన్ని క‌లిపేద్దామా!
’’... అంటూ ఈ పాట సాగుతుంది. అనిరుధ్ రవిచందర్ బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రావణ భార్గవి ఆలపించారు.  

ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు నటిస్తున్నారు.

More Telugu News