Kiran: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

Another Telugu Student Dies in the US

  • ఇటీవల అమెరికాలో తరచుగా తెలుగు విద్యార్థుల మృతి
  • తాజాగా కిరణ్ అనే విద్యార్థి దుర్మరణం
  • స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోయిన కిరణ్
  • కిరణ్ స్వగ్రామం తెలంగాణలోని ఖమ్మం జిల్లా చిన్న కోరుకొండి గ్రామం

ఇటీవల కాలంలో తెలుగు విద్యార్థులు అమెరికాలో మృత్యువాత పడుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మరో తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందిన ఘటన వెల్లడైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోయాడు. 

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేందుకు దిగిన కిరణ్.. ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కిరణ్ మృతితో అతడి స్వగ్రామం చిన్న కోరుకొండిలో విషాద ఛాయలు అలముకున్నాయి. అతడి మరణ వార్త విని కుటుంబం తల్లడిల్లిపోతోంది.

Kiran
Death
Swimming Pool
Missouri
USA
Khammam District
Telangana
  • Loading...

More Telugu News