Pensions: ఏపీలో ఇవాళ ఒక్కరోజే 94 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

94 Percent pensions given by AP Govt today

  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేడు తొలిసారి పెన్షన్ల పంపిణీ
  • రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు
  • ఇవాళ 61 లక్షల మందికి పెన్షన్ అందజేసిన చంద్రబాబు ప్రభుత్వం

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేడు (జూన్ 1) తొలిసారిగా పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజులోనే 94 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయింది. ఏపీలో మొత్తం 65,18,496 మంది పింఛనుదారులు ఉండగా, వారిలో 61 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అది కూడా ఇళ్ల వద్దకే వెళ్లి అందించారు. 

విజయనగరం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 97 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91 శాతం మందికి పెన్షన్లు ఇచ్చారు. 

నేటి ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News