GHMC: భాగ్యనగరవాసులకు అలర్ట్... 4, 5 తేదీల్లో పలు ప్రాంతాల్లో నీటిసరఫరాకు అంతరాయం

Disruption in drinking water in Hyderabad

  • సింగూరు 3, 4 ఫేజ్‌లలో సబ్ స్టేషన్ మరమ్మతులు ఉన్నట్లు వెల్లడి
  • పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్‌లలో మరమ్మతులు ఉంటాయని వెల్లడి
  • తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్న జలమండలి

భాగ్యనగరవాసులకు అలర్ట్! హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 4, 5 తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని హైదరాబాద్ జలమండలి ప్రకటించింది. సింగూరు 3, 4 ఫేజ్‌లలో సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్‌లలో మరమ్మతులు నిర్వహించనున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News