Nara Lokesh: లడఖ్ లో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh assures full support from state govt to deceased army jawans families

  • లడఖ్ లో ఆకస్మిక వరదలు
  • నదిలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు
  • ఐదుగురు జవాన్ల దుర్మరణం
  • మరణించినవారిలో ముగ్గురు ఏపీ జవాన్లు
  • ఏపీ జవాన్ల మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మంత్రి నారా లోకేశ్

లడఖ్ లో యుద్ధ ట్యాంకుతో నదిని దాటడంలో శిక్షణ పొందుతున్న ఆర్మీ జవాన్లు హఠాత్తుగా వరదరావడంతో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు సైనికులు చనిపోగా, అందులో ముగ్గురు ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 

ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు మృత్యువాత పడడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. లడఖ్ లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. 

"వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను... వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది" అని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News