Priyanka Gandhi: నా సోదరుడు ఎన్నడూ హిందువులను అవమానించలేదు: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi says her brother Rahul Gandhi never insult hindus

  • లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలపై రగడ
  • రాహుల్ హిందువులను అవమానించాడంటున్న బీజేపీ నేతలు
  • తన సోదరుడు బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించాడన్న ప్రియాంక
  • లోక్ సభలో రాహుల్ స్పష్టంగా మాట్లాడాడని వెల్లడి 

లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం ప్రకంపనలు సృష్టిస్తోంది.  హిందువులమని చెప్పుకుంటూ బీజేపీ నేతలు హింసకు పాల్పడుతున్నారు, 24 గంటలూ హింస, ద్వేషం...  మీరా హిందువులు? ప్రధాని మోదీతో కూడిన బీజేపీ ఎంతమాత్రం హిందూ సమాజం కాదు అంటూ రాహుల్ లోక్ సభలో ధ్వజమెత్తారు. అయితే రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హిందువులను అవమానించారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

దీనిపై రాహుల్ సోదరి, కాంగ్రెస్ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. తన సోదరుడు ఎన్నడూ హిందువులను అవమానించలేదని స్పష్టం చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీ స్పష్టంగా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు చేసింది బీజేపీ గురించి, ఆ పార్టీ నేతల గురించేనని అన్నారు.

More Telugu News