Palla Rajashwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్

Palla Rajeswar Reddy arrested

  • నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం మోతీలాల్ నాయక్ దీక్ష
  • వారం రోజులుగా గాంధీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్
  • పరామర్శించేందుకు గాంధీకి వెళ్లిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు

జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీలో దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను కలిసేందుకు ఎమ్మెల్యే వచ్చారు. దీంతో పల్లాను అరెస్ట్ చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం మోతీలాల్ నాయక్ వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయనను పరామర్శించేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిన్న మోతీలాల్ నాయక్‌తో కాసేపు చర్చలు జరిపారు.

Palla Rajashwar Reddy
BRS
Gandhi Hospital
Telangana
  • Loading...

More Telugu News