Nandigam Suresh: ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు

YCP leader Nandigam Suresh brother Prabhu Das arrested

  • ఉద్దండరాయునిపాలెంలో ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు
  • రెండు లారీలు, కారు స్వాధీనం
  • ప్రభుదాస్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు సంబంధించి ఇటీవల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బరితెగించిన ఇసుక మాఫియా ఏకంగా పోలీసులకే సవాలు విసురుతోంది. దీంతో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.

తాజాగా, బాపట్ల వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉద్దండరాయునిపాలెంలో ఇసుకను తరలిస్తున్న లారీలను పట్టుకున్న తుళ్లూరు పోలీసులు ప్రభుదాస్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు లారీలు, కారును స్వాధీనం చేసుకున్నారు.

Nandigam Suresh
Prabhudas
YSRCP
Baptla
  • Loading...

More Telugu News