VidaaMuyarchi: అజిత్ ‘విడాముయ‌ర్చి’ నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

First look from Ajith starring Vidaamuyarchi released

  • అజిత్ హీరోగా 'విడాముయర్చి'
  • మగిళ్ తిరుమేని దర్శకత్వంలో చిత్రం
  • ఆకట్టుకుంటున్న అజిత్ ఫస్ట్ లుక్

అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ఈ క్రేజీ కాంబోలో సినిమా అన‌గానే అభిమానులు స‌హా అంద‌రిలో భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. 

తాజాగా ‘విడాముయ‌ర్చి’ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అజిత్ ఓ బ్యాగ్ పట్టుకుని రోడ్ పై నడుస్తూ వస్తుండడాన్ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూడొచ్చు. అజిత్ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్). 'మంగాత' చిత్రంలో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

'విడాముయర్చి' చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది.

VidaaMuyarchi
Ajith
First Look
Magizh Tirumeni
Lyca Productions
Kollywood
  • Loading...

More Telugu News