Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు ఏర్పాటు చేసిన నిధికి సినీ ప్రముఖుల విరాళాలు

Film industry persons donates for Raghurama fund in Undi

  • ఎన్నికల్లో ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామ విజయం
  • ఉండి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా డ్రైనేజి మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటు
  • రూ.5 లక్షల విరాళం అందించిన నిర్మాత అశ్వినీదత్
  • రూ.3 లక్షల విరాళం ఇచ్చిన నటుడు రావు రమేశ్

టీడీపీ నేత, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా డ్రైనేజి మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఈ ఫండ్ కు దాతలు విరాళాలు ఇవ్వాలని ఇటీవల విజ్ఞప్తి చేశారు. రఘురామ విజ్ఞప్తికి సినీ ప్రముఖులు స్పందించారు. 

తాజాగా, ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ రూ.5 లక్షల విరాళం అందించారు. దీనిపై రఘురామ ట్వీట్ చేశారు. "ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన డ్రైనేజి మెయింటెనెన్స్ ఫండ్ కు నా మిత్రుడు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ గారు రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని వెల్లడించారు. 

అంతకుముందు, ప్రముఖ నటుడు రావు రమేశ్ కూడా రఘురామకు రూ.3 లక్షల విరాళం తాలూకు చెక్ అందజేశారు.

More Telugu News