Atchannaidu: అంబటి... ఇది నీ సబ్జెక్ట్ కాదు: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu fires on Ambati Rambabu

  • పోలవరం గురించి చంద్రబాబుకు కూడా అర్థం కాలేదన్నమాట అంటూ అంబటి వ్యంగ్యం
  • నీకు టీఎంసీ అంటే ఏంటో తెలుసా అంటూ అచ్చెన్నాయుడు ఫైర్
  • అన్నింట్లో దూరి అభాసుపాలవ్వకు అంటూ హితవు
  • నీకు తెలిసిన విద్యలు వేరే ఉన్నాయంటూ వ్యంగ్యం

పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబుకు కూడా అర్థం కాలేదన్నమాట అంటూ వైసీపీ నేత, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. అంబటి... నీకూ చంద్రబాబు గారికి పోలికా? అంటూ మండిపడ్డారు.

"అసలు నీకు టీఎంసీ అంటే ఏంటో తెలుసా? కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారో తెలుసా? కాఫర్ డ్యామ్ ఉపయోగం తెలుసా? నిర్మాణ పనులు పూర్తయ్యేవరకు నదీ ప్రవాహాన్ని మళ్లించడానికే కాఫర్ డ్యామ్ కడతారు. నదీ ప్రవాహం మళ్లింపునకు కాఫర్ డ్యామ్ ఒక్కటే పరిష్కారం కాదని, కాఫర్ డ్యామ్ లేకుండా పోలవరం కడతామని కేంద్రం చెప్పిన విషయాన్నే చంద్రబాబు గారు చెప్పారు" అంటూ అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

"అయినా ఇది నీ సబ్జెక్ట్ కాదు... నీకు తెలిసిన విద్యలు వేరే ఉన్నాయి.. అన్నింట్లో దూరి అభాసుపాలవ్వకు... మళ్లీ సంజన దగ్గరకు వెళ్లి తలంటు పోసుకోవాలి!" అంటూ సెటైర్లు వేశారు.

Atchannaidu
Ambati Rambabu
Polavaram Project
Chandrababu
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News