Rohit Sharma: వరల్డ్ కప్ అందించిన పిచ్‌పై ఉన్న ఇసుకను తిన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో

Rohit Sharma Eat sand with his mouth From Barbados Pitch

  • వరల్డ్ కప్ గెలిచాక భావోద్వేగంతో సెలబ్రేట్ చేసుకున్న కెప్టెన్
  • కప్ గెలిచిన పిచ్‌పై మమకారంతో ఇసుకను తీసి నోట్లో వేసుకున్న హిట్‌మ్యాన్ 
  • వీడియోను షేర్ చేసిన ఐసీసీ

భారత్ రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. బార్బడోస్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించాక తీవ్ర భావద్వేగానికి గురయ్యాడు. ఆనంద బాష్పాలు కార్చాడు. భావోద్వేగానికి గురైన కెప్టెన్ రోహిత్ విజయ క్షణాలను ఎప్పటికీ తనలో భాగం చేసుకుంటూ ఫైనల్ మ్యాచ్‌కు వేదికైన బార్బడోస్ పిచ్‌పై మమకారం చూపించాడు. పిచ్‌పై ఇసుకను తిన్నాడు. రెండు సార్లు చాలా తక్కువ మోతాదులో చేతితో తీసి నోట్లో వేసుకున్నాడు. సహచర ఆటగాళ్లు, ఇతర సిబ్బంది అందరూ ఆనంద బాష్పాలు కారుతున్న వేళ రోహిత్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

కాగా ఫైనల్ మ్యాచ్‌లో గెలుపు అనంతరం మీడియా సమావేశంలో రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందే విరాట్ కోహ్లీ ప్రకటనను ప్రస్తావిస్తూ తనకు కూడా ఇదే మ్యాచ్ అని క్లారిటీ ఇచ్చాడు. ఈ ఫార్మాట్‌లో ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి ఆస్వాదిస్తున్నానని, ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదని అన్నాడు. ఈ మ్యాచ్‌లో  ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని, తాను కోరుకున్నది ఇదేనని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లందరికీ సెల్యూట్ చేసి రోహిత్ శర్మ చప్పట్లు కొట్టి అభినందించాడు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

Rohit Sharma
Barbados Pitch
Eats sand
Cricket
Team India
T20 World Cup 2024
  • Loading...

More Telugu News