CH Shetty: ఎస్బీఐ చైర్మన్‌గా తెలంగాణ బిడ్డ
- ఎస్బీఐ చైర్మన్‌గా పాలమూరు జిల్లాకు చెందిన సీహెచ్ శెట్టి ఎంపిక
- తదుపరి చైర్మన్‌గా శెట్టిని ఎంపిక చేసిన ఎఫ్ఎస్ఐబీ
- ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సీహెచ్ శెట్టి
- అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న శెట్టి
భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి ఎంపికయ్యారు. ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సీఎస్ శెట్టిని చైర్మన్‌గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో సిఫారస్ చేసింది.
ప్రస్తుతం సంస్థ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా ఈ ఏడాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో నూతన చైర్మన్ ను నియమించడానికి ఎఫ్ఎస్‌ఐబీ పలువురు సీనియర్ ఉన్నతాధికారులను శనివారం ఇంటర్వ్యూ చేసింది. వీరిలో శెట్టి కూడా ఒకరు. బ్యాంకులో వారి పనితీరు అనుభవం, ప్రస్తుత పరిమితులను దృష్టిలో పెట్టుకుని చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్బీఐ చైర్మన్ పదవికి సిఫారసు చేసినట్టు ఎఫ్ఎస్ఐబీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ (ఏసీసీ) కమిటీ సమావేశమై ఎఫ్ఎస్ఐబీ సూచించిన వ్యక్తిపై తుది నిర్ణయం తీసుకోనున్నది.
ఎస్బీఐ ఎండీగా జనవరి 2020లో శెట్టి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ అండ్ టెక్నాలజీ వర్టికల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి శెట్టి బేసిక్ వేతనం 26.3 లక్షలు, డీఏ కింద మరో రూ. 9.7 లక్షలు అందుకున్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మానవపాడు మండలంలోని పెద్ద పోతులపాడు గ్రామంలో పదో తరగతి వరకూ చదువుకున్న సీహెచ్ శెట్టి ఆ తరువాత గద్వాల్‌లో ఉన్నత చదువులు చదివారు. రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి బీఏ అగ్రికల్చర్‌లో పట్టా పొందారు. ఎస్బీఐలో 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయిలో కెరియర్ ప్రారంభించిన శెట్టి, బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నది కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ విధులు నిర్వహించారు.