Rohit Sharma: పాండ్యాకు ముద్దిచ్చిన రోహిత్.. వీడియో ఇదిగో!

Rohit Sharma Kisses Hardik Pandya

  • మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతుండగా ఘటన
  • దగ్గరికెళ్లి ముద్దిచి ఆలింగనం చేసుకున్న రోహిత్
  • మూడు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించిన పాండ్యాా

టీ20 ప్రపంచకప్‌ను సాధించిన ఆనందంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమిండియా సారథి రోహిత్‌శర్మ ముద్దిచ్చిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్‌ కోల్పోయి విజయం భారత్ చేతికి చిక్కిన తర్వాత రోహిత్‌శర్మ మైదానంపై పడిపోయి విజయాన్ని ఆస్వాదించాడు. రాహుల్ ద్రావిడ్ అయితే చిన్నపిల్లాడిలా గంతులేశాడు. మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా మైదానంలో మాట్లాడుతుండగా రోహిత్ వచ్చి ముద్దిచ్చాడు.  

ఆటతీరుపై ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా ఫైనల్‌లో మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. గెలుపు తర్వాత ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన సమయంలో హెన్రిక్ క్లాసెన్ వికెట్ తీసిన పాండ్యా మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. ఈ విజయం తనకు చాలా స్పెషల్ అని, గత ఆరు నెలల్లో తాను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని పేర్కొన్నాడు. కష్టపడితే ఫలితం ఉంటుందని నమ్మానని పేర్కొన్నాడు. ఇలాంటి అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమన్నాడు.

Rohit Sharma
Hardik Pandya
Team India
T20 World Cup 2024

More Telugu News