DK Shivakumar: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై డీకే శివకుమార్ స్పందన!

Dk Shivakumar on CM Change in Karnataka

  • డీకేను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఓ మతపెద్ద సహా పలువురు నేతల డిమాండ్లు
  • ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని డీకే శివకుమార్ సూచన
  • తన పనితీరు ఆధారంగా పార్టీ హైకమాండ్ తగు నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య
  • పార్టీలో క్రమశిక్ష ముఖ్యమని స్పష్టీకరణ

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పునకు డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఎవరూ రికమెండేషన్లు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తన పనితీరు ఆధారంగా పార్టీ హైకమాండ్ తగు నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన విలేకరులతో ముచ్చటించారు.

 ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో డిప్యూటీ సీఎం, సీఎం పదవిపై ఎటువంటి చర్చా లేదు. నాపై అభిమానంతో చంద్రశేఖర నాథ స్వామి అలా మాట్లాడారు. అయితే, నన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఎవరూ సూచించవద్దని కోరుతున్నా. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సీఎం, నేను, హైకమాండ్ కలిసి ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఏకాభిప్రాయానికి వచ్చాము. ఎమ్మెల్యేలు, మంత్రులు, లేదా మతపెద్దలు ఈవిషయంలో స్పందించాల్సిన అవసరం లేదు. నాకు మద్దతుగా నిలవాలనుకున్న వారు దేవుడిని నా కోసం ప్రార్థించాలి. అక్కడితో ఈ విషయం ముగిసిపోవాలి’’ 

‘‘ఈ విషయంలో మంత్రులెవరూ మీడియాతో మాట్లాడొద్దని కోరుతున్నా. సీఎం పోస్టుపై బహిరంగ ప్రకటనలు చేసిన వారికి ఏఐసీసీ ద్వారా నోటీసులు వస్తాయి. పార్టీని అధికారంలో తెచ్చేందుకు మనందరం ఎంతో కృషి చేశాము. కాబట్టి, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై మౌనంగా ఉండటమే శ్రేయస్కరం. కాబట్టి, మతపెద్దలు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని సవినయంగా మనవి చేస్తున్నా’’ అని డీకే శివకుమార్ అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లేకపోతే అంతా వృథా అయిపోతుందని హెచ్చరిక చేశారు.

DK Shivakumar
Karnataka
  • Loading...

More Telugu News