Indian-2: మలేసియాలో 'ఇండియన్-2' ప్రమోషన్స్ కు అపూర్వ స్పందన

Indian 2 promotions in Malaysia garnes huge response
  • కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఇండియన్-2
  • శంకర్ దర్శకత్వంలో సీక్వెల్
  • జులై 12న గ్రాండ్ రిలీజ్
  • వరల్డ్ వైడ్ గా ప్రమోషన్స్ 

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇండియన్-2. ఈ చిత్రం జులై 12న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్-2 చిత్ర బృందం ప్రపంచవ్యాప్త ప్రమోషన్స్ కు ప్లాన్ చేసింది. 

తాజాగా, మలేసియాలో ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించగా, అభిమానుల నుంచి లభించిన స్పందన అదిరిపోయింది. కమల్ హాసన్, సిద్ధార్ధ్, ఎస్ జే సూర్య ఈ ప్రమోషన్ ఈవెంట్ కు హాజరు కాగా, వారిని చూసేందుకు మలేసియాలోని ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. 

ఇండియన్-2 చిత్రం పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో భారతీయుడు-2 పేరుతో వస్తోంది.

  • Loading...

More Telugu News