T20 World Cup 2024: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బార్బడోస్‌లో సూర్యుడు వచ్చేశాడోచ్!
- బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా అమీతుమీ
- కీలక మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉందనడంతో ఫ్యాన్స్‌లో గుబులు
- కానీ, శనివారం ఉదయం బార్బడోస్‌లో పొడి వాతావరణం
ఇంకొన్ని గంటల్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మొదలుకానుంది. ఈ కీలకమైన పోరుకు బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదిక కానుంది. అయితే కీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం కూడా అక్కడ భారీగా వర్షం కురిసినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరలయ్యాయి. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అలా కలవరపడుతున్న క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.
శనివారం ఉదయం బార్బడోస్‌లో వాతావరణం పొడిగా ఉంది. సూర్యోదయం సమయంలో సూర్యుడు క్లీయర్‌గా కనిపించాడు. దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సైతం మార్నింగ్ సమయంలో మైదానంలోకి దిగి కసరత్తు చేయడం వీడియోలో ఉంది.
ఇక మ్యాచ్ సమయానికి కూడా పెద్దగా వర్షం అంతరాయం కలిగించకపోవచ్చని వాతావరణ నిపుణులు అంటున్నారు. అయితే మ్యాచ్ మధ్యలో చిన్న చిరుజల్లులు రావొచ్చని అంచనా. అయినా అది ఆటకు పెద్దగా ఇబ్బంది కలిగించదని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే ఆదివారం రిజర్వ్ డే ఉంది.