Nitish Kumar: మోదీ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ మెలిక... హోదా కావాలంటూ తీర్మానం!

Nitish Kumar repeats special status demand for Bihar at key JDU meet

  • జేడీయూ పార్టీ సమావేశంలో హోదాపై కీలక తీర్మానం
  • బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదన్న జేడీయూ నేత
  • ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మెలిక పెట్టారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో నిలబడటానికి నితీశ్ కుమార్, టీడీపీ ప్రధాన కారణం. ఈ క్రమంలో జేడీయూ పార్టీ సమావేశంలో కీలక తీర్మానం చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తేల్చి చెప్పింది.

శనివారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఇందులో బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకువచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. అలాగే, ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక, కఠినచట్టం చేయాలని కోరింది.

పార్టీ సమావేశం అనంతరం జేడీయూ నేత ఒకరు మాట్లాడుతూ... బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదన్నారు. రాష్ట్ర వృద్ధి పథాన్ని వేగవంతం చేయడం, సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమైన దశ అన్నారు.

More Telugu News