Pawan Kalyan: డీఎస్ మృతి పట్ల పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ సంతాపం

Pawan Kalyan condoles death

  • ఉద్యమం సమయంలో డీఎస్ తన వాదాన్ని బలంగా వినిపించారన్న పవన్ కల్యాణ్
  • ఎన్నో సేవలందించారంటూ నాదెండ్ల నివాళులు 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో డీఎస్ బలంగా తన వాదాన్ని వినిపించారని గుర్తు చేసుకున్నారు.

డీఎస్ మృతి పట్ల ఏపీ మంత్రి, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సంతాపం తెలిపారు. మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మరణం బాధాకరమని... ఆయన అత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన డీఎస్ ప్రజాజీవితంలో మూడున్నర దశాబ్దాలపాటు ఉన్నారన్నారు. రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారన్నారు. డీఎస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Pawan Kalyan
Dharmapuri Srinivas
Telangana
  • Loading...

More Telugu News