Mohammad Kaif: ధోనీలా కోహ్లీకి హీరో అయ్యే ఛాన్స్: మహ్మద్ కైఫ్
![Mohammad Kaif Comments on Virat Kohli](https://imgd.ap7am.com/thumbnail/cr-20240629tn667fc28f60f9a.jpg)
- బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా అమీతుమీ
- 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో హీరో అయ్యాడన్న కైఫ్
- ఇవాళ్టి ఫైనల్‌లో కోహ్లీ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి హీరో అవ్వాలని వ్యాఖ్య
మరి కొన్ని గంటల్లో టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌తో పాటు విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ హీరోగా మారే అవకాశం ఉందని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
2011 వన్డే వరల్డ్‌కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్‌లో లేకపోయినా ఫైనల్‌లో అజేయంగా 91 పరుగులు చేసి హీరోగా నిలిచాడని కైఫ్ గుర్తు చేశాడు. ఎంఎస్‌డీ కొట్టిన విన్నింగ్ షాట్ ఎప్పటికీ క్రికెట్ అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందన్నాడు.
విరాట్ గత మ్యాచ్‌లను మరిచిపోయి ఇవాళ చివరి వరకు ఆడితే హీరో అయ్యే ఛాన్స్ ఉందని సూచించాడు. స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాపై కోహ్లీ శతకం బాదాడని, ఇప్పుడు కూడా సెంచరీ ఇన్నింగ్స్ ఆడాలని కైఫ్ ఆకాంక్షించాడు.