YS Jagan: ప్రతిపక్ష హోదా కోసం జగన్ ఎందుకంత పట్టుబడుతున్నారు? ప్రతిపక్ష నేతకు ఉండే పవర్స్ ఏంటి?
- ప్రతిపక్ష హోదా కోసం జగన్ పట్టు
- గతంలో కనీస సీట్లు లేకున్నా కొన్ని పార్టీలకు ఇచ్చారంటూ వాదన
- జగన్ వాదనలో పస ఎంత?
- ప్రతిపక్ష నేతకు ఉన్న హక్కులు, అధికారాలు ఏమిటి?
- ఈ ప్రశ్నలకు సవివరమైన సమాధానాలు వీడియోలో!
ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో వైసీపీ పిటిషన్ కూడా వేసింది. సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న నియమం ఏదీ లేదనేది వైసీపీ వాదన. గతంలో లోక్‌సభలో, ఢిల్లీ అసెంబ్లీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల శాతంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చారని జగన్ అంటున్నారు.
1984 లోక్‌సభ ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీకి, 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లే వచ్చిన కాంగ్రెస్‌కు, 2015లో ఢిల్లీ అసెంబ్లీలో మూడే సీట్లు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని వాదిస్తున్నారు. ఈ వాదనల్లో పస ఎంత? అసలు ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ ఎందుకంత పట్టుబడుతున్నారు? ప్రతిపక్షనేతకు ఉండే హక్కులు, అధికారాలు ఏమిటో ఈ వీడియోలో ఓసారి చూద్దాం!