Prathipati Pulla Rao: ఆ హత్య జరిగిన రోజే పిన్నెల్లి పతనం ప్రారంభమైంది: ప్రత్తిపాటి

Prathipati responds on Pinnelli arrest


టీడీపీ ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పై స్పందించారు. రాష్ట్రంలో రౌడీ మూకలకు మూడిందని చెప్పడానికి పిన్నెల్లి అరెస్టే సంకేతమని అన్నారు. పల్నాడులో తోట చంద్రయ్య హత్య జరిగిన రోజే పిన్నెల్లి పతనం ప్రారంభమైందని స్పష్టం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని, వారికి అండగా నిలిచిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి కోరారు. మాచర్ల కేంద్రంగా పిన్నెల్లి నిర్మించిన నేర సామ్రాజ్యాన్ని పెకలించాలని అన్నారు.

Prathipati Pulla Rao
Pinnelli Ramakrishna Reddy
Arrest
TDP
YSRCP
Macherla
  • Loading...

More Telugu News