Harish Rao: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితను క‌లిసిన‌ మాజీ మంత్రి హరీశ్‌ రావు

Former Minister Harish Rao Meet MLC Kavitha in Tihar Jail
  • ములాఖాత్ సందర్భంగా కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హ‌రీశ్ రావు
  • ఇటీవ‌లే క‌విత‌ను క‌లిసిన మాజీ మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, స‌బితా ఇంద్రారెడ్డి
  • ఇటీవలే కవిత జ్యుడీషియల్‌ కస్టడీని మరోసారి పొడిగించిన రౌస్‌ ఎవెన్యూ కోర్టు
  • దీంతో జులై 5వ తేదీ వరకు తీహార్ జైల్లోనే ఉండ‌నున్న క‌విత‌  
తీహార్ జైలులో ఉన్న‌ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి హరీశ్‌ రావు శుక్ర‌వారం ఉదయం క‌లిశారు. ఈ ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇటీవ‌లే మాజీ మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, స‌బితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ క‌విత‌ను క‌లిసిన‌ విష‌యం తెలిసిందే.

ఇక ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించిన సంగ‌తి తెలిసిందే. జులై 5వ తేదీ వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
Harish Rao
K Kavitha
Tihar Jail
BRS
Telangana
New Delhi

More Telugu News