Nara Lokesh: జీవితంలో ఏదైనా సాధించాలంటే ఇంతకుమించిన పాఠ్యాంశం ఎక్కడా దొరకదు: మంత్రి నారా లోకేశ్

AP Minister Nara Lokesh hails Ramoji Rao

  • విజయవాడలో రామోజీరావు సంస్మరణ కార్యక్రమం
  • హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్
  • శ్రమయేవ జయతే అనే పదానికి రామోజీరావు పర్యాయపదం అని వెల్లడి
  • అక్షరం రూపంలో ఎప్పటికీ మన మధ్యనే ఉంటారని స్పష్టీకరణ

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్లకు రామోజీరావు జీవితాన్ని మించిన పాఠ్యాంశం ఏ బిజినెస్ స్కూల్ లోనూ, ఏ యూనివర్సిటీలోనూ దొరకదని స్పష్టం చేశారు. 

శ్రమయేవ జయతే అనే పదానికి పర్యాయపదం... రామోజీరావు అని లోకేశ్ అభివర్ణించారు. విశ్వసనీయతకు విశ్వరూపం రామోజీరావు... ఎదిగేకొద్దీ ఒదిగి ఉండడం అనే పదానికి మానవరూపం కల్పిస్తే అది రామోజీరావు అని కొనియాడారు. 

"పరిపూర్ణ మానవుడికి ఉండాల్సిన విశిష్ట లక్షణాలు అనేకం రామోజీరావు గారిలో ఉన్నాయి. రామోజీరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా అక్షరం రూపంలో ఎప్పుడూ మన మధ్యే ఉంటారు" అంటూ నారా లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.

More Telugu News