Reliance Jio: జియో ప్లాన్ల ధరలు పెరిగాయి... గమనించారా?

Reliance Jio hikes its recharge plans

  • కనిష్ఠంగా 12.5 శాతం, గరిష్ఠంగా 25 శాతం టారిఫ్ పెంపు
  • పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి!
  • ఇకపై రోజుకు 2జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లకు అపరిమిత 5జీ సేవలు

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన రీచార్జి ప్లాన్ల ధరలను పెంచింది. ఆయా ప్లాన్లను అనుసరించి కనిష్ఠంగా 12.5 శాతం, గరిష్ఠంగా 25 శాతం మేర ధరలు పెంచినట్టు జియో నేడు వెల్లడించింది. పెంచిన ధరలు జులై 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 

అంతేకాదు, ఇకపై కొన్ని ప్లాన్లకు మాత్రమే అన్ లిమిటెడ్ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని జియో స్పష్టం చేసింది. రోజుకు 2జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లకే అన్ లిమిటెడ్ 5జీ సేవలు లభ్యమవుతాయని తెలిపింది. 

దాంతో పాటు జియో రెండు కొత్త యాప్ లను కూడా ప్రవేశపెట్టింది. జియో సేఫ్-క్వాంటమ్ సెక్యూర్, జియో ట్రాన్స్ లేట్ పేరిట తీసుకువచ్చిన ఈ యాప్ లను జియో యూజర్లకు ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తున్నట్టు జియో నేడు ప్రకటించింది. 

జియో సేఫ్-క్వాంటమ్ సెక్యూర్ యాప్ ద్వారా కాలింగ్, మెసేజింగ్, ఫైల్ ట్రాన్స్ ఫర్, ఇతర కమ్యూనికేషన్ సేవలు పొందవచ్చు. ఇక జియో ట్రాన్స్ లేట్ ద్వారా వాయిస్ కాల్, వాయిస్ మెసేజ్, టెక్ట్స్, ఇమేజ్ లోని డేటాను కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అనువదిస్తుంది.

జియో కొత్త  టారిఫ్ ఇదే...

Reliance Jio
Recharge Plans
Tariff
Plans
  • Loading...

More Telugu News