Ramoji Rao: 'అమరావతి' నిర్మాణానికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన రామోజీరావు తనయుడు కిరణ్

Ramoji Rao son Kiran announces Rs 10 Cr donation for Amaravathi construction

  • విజయవాడలో రామోజీరావు సంస్మరణ కార్యక్రమం
  • హాజరైన రామోజీరావు తనయుడు కిరణ్
  • తన తండ్రి ప్రజాస్వామ్య విలువల కోసం పరితపించారని వెల్లడి
  • ప్రజలకు ఆపద వస్తే అండగా నిలిచేవారని ఉద్ఘాటన 

పత్రికా రంగ దిగ్గజం రామోజీరావు సంస్మరణ కార్యక్రమంలో ఆయన కుమారుడు కిరణ్ కూడా పాల్గొన్నారు. విజయవాడలోని అనుమోలు గార్డెన్స్ లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నాన్న గారి సంస్మరణ సభ నిర్వహించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.  

తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడేవారని, ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నారు. నాన్న గారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటానని మాటిస్తున్నాం అని కిరణ్ స్పష్టం చేశారు. 

నాడు ఆయన నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు సూచించారని, తాజాగా, అమరావతి నిర్మాణం కోసం తాము రూ.10 కోట్లు విరాళం అందిస్తున్నామని సభా ముఖంగా ప్రకటించారు. అమరావతి... దేశంలోనే గొప్ప నగరంగా వర్ధిల్లాలి అని కిరణ్ ఆకాంక్షించారు.

More Telugu News