Keeravani: రామోజీరావులా ఒక్కరోజు జీవించగలిగినా చాలు: కీరవాణి

Keeravani attends Ramoji Rao memorial service in Vijayawada

  • నేడు విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ
  • హాజరైన కీరవాణి, రాజమౌళి
  • సంగీత దర్శకుడిగా రామోజీరావు తనకు జన్మనిచ్చారన్న కీరవాణి

పాత్రికేయ, సినీ రంగాలలో దిగ్గజ స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పేర్కొన్నారు. ఈ సాయంత్రం విజయవాడ అనుమోలు గార్డెన్స్ లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రామోజీరావు సంస్మరణ సభకు కీరవాణి తన సోదరుడు రాజమౌళితో కలిసి హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో కీరవాణి ప్రసంగిస్తూ, మహోన్నతమైన వ్యక్తిత్వానికి రామోజీరావు ప్రతీక అని కొనియాడారు. ఆయనలా ఒక్కరోజు జీవించగలిగినా చాలు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. రామోజీరావు సంగీత దర్శకుడిగా తనకు జన్మనిచ్చారని, ఉషా కిరణ్ మూవీస్ లో మనసు-మమత చిత్రంతో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం మొదలైందని కీరవాణి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.

More Telugu News