Murali Mohan: రామోజీరావు ఎంతోమంది చిన్న నటులకు లైఫ్ ఇచ్చారు: మురళీమోహన్

Murali Mohan says Ramojirao gave chances to so many small time actors

  • విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ
  • ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • హాజరైన మురళీ మోహన్
  • రామోజీరావు సినీ రంగ అభివృద్ధికి కృషి చేశారని వెల్లడి

విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు సీనియర్ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. రైతు కుటుంబం నుంచి వచ్చి అనేక రంగాల్లో రాణించారని పేర్కొన్నారు. రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి సినీరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఎంతో మంది చిన్న నటులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారని మురళీమోహన్ వెల్లడించారు.  సమాజాన్ని జాగృతం చేసేలా, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా సినిమాలు తీయాలని ఆయన ఎప్పుడూ అంటుండేవారని తెలిపారు.

More Telugu News