Ramoji Rao: విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ప్రారంభం

Ramojirao memorial service has began

  • ఇటీవల రామోజీరావు అస్తమయం
  • ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు సంస్మరణ సభ
  • కానూరు అనుమోలు గార్డెన్స్ లో కార్యక్రమం
  • సభకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 

ఇటీవల కన్నుమూసిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం నేడు విజయవాడలో ఏర్పాటు చేసింది. కానూరులోని అనుమోలు గార్డెన్స్ లో రామోజీరావు సంస్మరణ సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు. 

ఏపీ ప్రభుత్వం రామోజీ సంస్మరణ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సభకు రాజకీయ, సినీ, పాత్రికేయ రంగాల వారు విచ్చేశారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సినీ నిర్మాతలు అశ్వినీదత్, ఆదిశేషగిరిరావు, దగ్గుబాటి సురేశ్, శ్యాంప్రసాద్ రెడ్డి, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు.

Ramoji Rao
Memorial Service
Vijayawada
AP Govt
  • Loading...

More Telugu News