Bujji: 'బుజ్జి'ని ఎక్కి సందడి చేసిన కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి

Krishnamraju wifer Shyamala Devi onboard Bujji the concept vehicle of Kalki 2898 AD movie

  • నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రం
  • ఇందులో ప్రభాస్ ఉపయోగించిన వాహనం పేరు 'బుజ్జి'
  • హైదరాబాదులోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద 'బుజ్జి' కోలాహలం
  • కల్కి సినిమా చూసేందుకు ఐమ్యాక్స్ కు వచ్చిన శ్యామలాదేవి

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం నేడు రిలీజైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 

కాగా, కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ ఉపయోగించిన కాన్సెప్ట్ వాహనం పేరు 'బుజ్జి'. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే 'బుజ్జి' వాహనాన్ని చిత్రబృందం రోడ్లపై తిప్పి ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంది. తాజాగా, 'బుజ్జి' వాహనం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ ముందు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 

ఇవాళ కల్కి 2898 ఏడీ సినిమా చూసేందుకు ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కూడా ప్రసాద్ ఐమ్యాక్స్ కు విచ్చేశారు. అక్కడున్న 'బుజ్జి' వాహనంలో ఎక్కి సందడి చేశారు. అభిమానులు కేరింతలు కొడుతుండగా, ఆమె అందరికీ అభివాదం చేశారు. కాసేపు అందులో కూర్చున్న శ్యామలాదేవి అనంతరం బయటికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

More Telugu News