CS Neerabh Kumar Prasad: ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు

AP CS Neerabh Kumar Prasad Tenure Extension


ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించింది. జులై 1 నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఆయ‌న స‌ర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా, నీరభ్‌ కుమార్‌ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన విష‌యం తెలిసిందే. 

ఇక ఆయన పదవీకాలం ఈ నెలాఖరులో ముగియనుంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావించి సీఎం చంద్ర‌బాబు కేంద్రానికి లేఖ రాశారు. చంద్ర‌బాబు అభ్య‌ర్థ‌న మేర‌కు తాజాగా సీఎస్ ప‌ద‌వీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

More Telugu News