: ఫోర్బ్స్ పత్రికపై సౌదీ రాకుమారుడి దావా


ఫోర్బ్స్ సంపన్నుల జాబితాపై సౌదీ అరేబియా రాకుమారుడు అల్వాలీద్ బిన్ తలాల్ కోర్టుకెక్కాడు. తన సంపద 3000 కోట్ల డాలర్లు అయితే, దానిని ఫోర్బ్స్ 1,000 కోట్లు తగ్గించి కేవలం 2,000 కోట్ల డాలర్లుగానే పేర్కొందని లండన్ హైకోర్టులో అల్వాలీద్ పరువు నష్టం దావా వేశారు. మార్చి 4న వెలువడ్డ ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అల్వాలీద్ 26వ స్థానంలో ఉన్నారు. ఆ వెంటనే సౌదీ రాజ కుటుంబం ఇది సరైన డేటా కాదంటూ ప్రకటన జారీ చేసింది. తాజాగా కోర్టులో వేసిన దావాలోనూ ఇదే పేర్కొన్నారు. ఫోర్బ్స్ పత్రిక ఎడిటర్ రాండెల్ లేన్, ఇద్దరు జర్నలిస్టుల పేర్లను అందులో ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News