Andhra Pradesh: ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల

AP tenth supplementary results released
  • ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
  • పాస్ అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
  • మే 24 నుంచి జూన్ 3 వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ బుధవారం సాయంత్రం వీటిని విడుదల చేశారు. పాస్ అయిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌లో (http://bse.ap.gov.in ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చూసుకోవచ్చు. తమ హాల్ టిక్కెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు. జనరల్ కేటగిరీతో పాటు ఒకేషనల్ ఫలితాలు కూడా విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం 1.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News