Jeevan Reddy: జీవన్ రెడ్డిని ఏఐసీసీ పెద్దల వద్దకు తీసుకెళ్లిన మున్షీ, శ్రీధర్ బాబు

Jeevan Reddy to meet AICC leaders

  • అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న జీవన్ రెడ్డి
  • దీపాదాస్ మున్షీతో సమావేశమైన జీవన్ రెడ్డి
  • శ్రీధర్ బాబు కారులో ఏఐసీసీ పెద్దల వద్దకు కాంగ్రెస్ అసంతృప్త నేత

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డితో ఏఐసీసీ పెద్దలు మాట్లాడనున్నారు. అధిష్ఠానం పిలుపుతో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారు ఏఐసీసీ పెద్దలతో మాట్లాడేందుకు వెళ్లారు. శ్రీధర్ బాబు కారులోనే జీవన్ రెడ్డి బయలుదేరారు.

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు దీపాదాస్ స్పందించారు. తమ పార్టీలో ఎవరూ అసంతృప్తిగా లేరని తెలిపారు. ఊహాజనిత ప్రశ్నలకు మాత్రం తాను సమాధానం చెప్పనని స్పష్టం చేశారు. మీడియా జీవన్ రెడ్డిని పలకరించే ప్రయత్నం చేసింది. అయితే, తర్వాత మాట్లాడుతానంటూ ఆయన వెళ్లిపోయారు.

Jeevan Reddy
Congress
Sridhar Babu
  • Loading...

More Telugu News