YSRCP: మా పార్టీ కార్యాలయాలను కూల్చబోతున్నారు: హైకోర్టులో వైసీపీ పిటిషన్

YCP petition in High Court
  • కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్ధమైందన్న పిటిషనర్
  • ఇప్పుడు కూల్చివేయబోవడం లేదన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది
  • అనుమతులు లేకుండా నిర్మించిన కార్యాలయాలకు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లోని తమ పార్టీ కార్యాలయాలను కూల్చివేయబోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.

అయితే, తాము ఇప్పటికిప్పుడు కూల్చి వేయబోవడం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాక కోర్టుకు సమర్పిస్తామన్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన కార్యాలయాలకు మాత్రమే నోటీసులు ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News