Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

Revanth Reddy meet Nitin Gadkari
  • భేటీలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి, మంత్రులు
  • రాష్ట్ర రహదారులపై సుదీర్ఘ చర్చ
  • ఫ్లైఓవర్ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు సహా పలు ప్రాజెక్టులపై చర్చ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రితో రాష్ట్ర రహదారులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించారు.

  • Loading...

More Telugu News