Anil Kumar Yadav: ఏపీ మాజీ మంత్రి అనిల్ పై నెల్లూరు మహిళ ఫిర్యాదు

Women Filed Police Case On Farmer Minister Anil Kumar Yadav

  • తన స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ ఆఫీస్ కడుతున్నారని ఆరోపణ
  • గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి చుట్టూ తిరిగామని ఆవేదన
  • న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన కౌసర్ జాన్

నెల్లూరుకు చెందిన కౌసర్ జాన్ అనే మహిళ ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులో జనార్దన్ రెడ్డి కాలనీలోని తన స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ కార్యాలయం కడుతున్నారని ఆరోపించారు. దీనివెనక మాజీ మంత్రి అనిల్ కుమార్ ఉన్నారని, న్యాయం చేయాలంటూ ఆయన ఆఫీసు చుట్టూ తిరిగినా అప్పుడాయన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ పై చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యజ్దానీ అనే వ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేశామని.. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కౌసర్ రాసుకొచ్చారు.

కబ్జా సూత్రధారి మాజీ మంత్రే..
తన స్థలాన్ని కబ్జా చేయడంలో సూత్రధారి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలకమని, అక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఆయనే శంకుస్థాపన చేశారని కౌసర్ జాన్ ఆరోపించారు. కష్టపడి పొదుపు చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన తన స్థలాన్ని తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని కౌసర్ మీడియాకు వెల్లడించారు.

More Telugu News