Om Birla: లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక

Om Birla Elected As Lok Sabha Speaker

  • మూజువాణీ ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటన
  • ఆయనను స్పీకర్ చైర్ వరకు తోడ్కొని వెళ్లిన మోదీ, రాహుల్
  • వరుసగా రెండోసారి స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించనున్న ఓం బిర్లా

లోక్ సభ స్పీకర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలుపొందారు. 18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణీ ఓటుతో ఆయన గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తోడ్కొని వెళ్లారు. స్పీకర్ చైర్ లో కూర్చుని వరుసగా రెండోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు.

రాజస్థాన్ లోని కోటా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు. వరుసగా అక్కడి నుంచే మూడోసారి గెలిచి సభలో అడుగుపెట్టారు. 17వ లోక్ సభ స్పీకర్ గా సేవలందించారు. కాగా, డిప్యూటీ స్పీకర్ లేకుండా ఐదేళ్ల పాటు పనిచేసిన స్పీకర్ గా ఓం బిర్లా రికార్డులకెక్కారు. గత ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోలేదనే విషయం తెలిసిందే. మరోవైపు, స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ సహా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలిపారు.

More Telugu News