G. Kishan Reddy: తెలంగాణ బిడ్డగా... కిషన్ రెడ్డిని సత్కరించాను: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy meets Kishan Reddy

  • కేంద్రమంత్రి పదవి చేపట్టినందుకు సత్కరించినట్లు వెల్లడి
  • తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరానన్న కోమటిరెడ్డి
  • ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడి

తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవి చేపట్టినందుకు ఆయనను సత్కరించానని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన కిషన్ రెడ్డిని కలిశారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు చెప్పారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ బిడ్డగా, కేంద్రమంత్రిగా రాష్ట్రానికి సహకరిస్తానని హామీ ఇచ్చారన్నారు.

వేణుగోపాల్‌ను కలిసిన రేవంత్ రెడ్డి

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి వెంట ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ ఉన్నారు.

More Telugu News