: చైనాలో ప్రమాదం... 42 మంది మృతి
ఇంకాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటారు. కానీ అప్పుడే మృత్యువు కసిగా కాటేసింది. అంతా సజావుగా సాగిపోతుందనుకుంటున్న ప్రయాణీకులు ఊహించని విధంగా అనంత లోకాలకు చేరిపోయారు. చైనాలోని పుజియాన్ ప్రాంతంలోని గ్జియామెన్ సిటీలో వేగంగా వెళ్తున్న ఓ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ తేరుకుని బస్సును ఆపేలోపే 42 మంది మృతి చెందారు. ఇందులో కొందరు కాలి బూడిదైపోగా మరి కొంతమంది పొగకు ఊపిరాడక చనిపోయారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణాలను చైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.