Jeevan Reddy: జీవన్ రెడ్డికి నేతల బుజ్జగింపులు... రంగంలోకి భట్టివిక్రమార్క

Congress leader queue to Jeevan Reddy house

  • బేగంపేటలోని జీవన్ రెడ్డి ఇంటికి భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, ఇతర నేతలు
  • రెండురోజులుగా బుజ్జగిస్తున్న కాంగ్రెస్ నేతలు
  • పరిస్థితిని బట్టి రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ మాట్లాడే అవకాశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. మంగళవారం బేగంపేటలోని ఆయన నివాసానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మంచిర్యాల, రామగుండం ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రాను, రాజ్ ఠాకూర్‌లు ఆయన నివాసానికి వెళ్లారు. రెండురోజులుగా బుజ్జగిస్తున్నప్పటికీ జీవన్ రెడ్డి బెట్టు వీడటం లేదు.

దీంతో ఏఐసీసీ ఆదేశాలతో భట్టివిక్రమార్క వంటి నేతలు రంగంలోకి దిగారు. పరిస్థితిని బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర నాయకులు ఆయనతో మాట్లాడే అవకాశముంది. ప్రధానంగా, నలభై ఏళ్లుగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను చేర్చుకున్నారని ఆయన తీవ్రమనస్తాపానికి గురయ్యారు.

Jeevan Reddy
Mallu Bhatti Vikramarka
Congress
  • Loading...

More Telugu News